కూతురికి తల్లి అదిరే ఆఫర్.. 100 మందితో డేటింగ్ చేస్తే రూ.41 లక్షలు..!

సాధారణంగా ప్రేమ విషయం బయటపడితే తల్లిదండ్రులు నానా హంగామా చేసి పిల్లలను తమ కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారని అందరికీ తెలిసిందే.అంతేకానీ ప్రేమ విషయం( Love ) తెలిస్తే కనీసం మన పిల్లలు ప్రేమించిన వారు ఎటువంటి వారు అని తెలుసుకునే ప్రయత్నం అస్సలు చేయరు.

 A Mother In Britain Offered 500 Dollars To Encourage Her Daughter To Dating Deta-TeluguStop.com

ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సభ్యులు ఇలాగే ఉంటారు.కానీ ఓ తల్లి మాత్రం తన కూతురికి ఈ భూమ్మీద ఏ తల్లి ఇవ్వని ఓ ఆఫర్ ఇచ్చింది.అంతేకాదు గెలిస్తే ఏకంగా 500 డాలర్లు, మన భారత కరెన్సీలో రూ.41 లక్షలు ఇస్తానని తెలిపింది.ఈ విషయం తెలిస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది.

ఇంతకు ఆఫర్ ఏమిటంటే.ఒక ఏడాదిలో 100 మంది అబ్బాయిలతో డేటింగ్( Dating ) చేస్తే రూ.41 లక్షలు ఇస్తానని ఓ తల్లి తన కూతురికి ఆఫర్ చేసింది.కూతురు ఆ ఛాలెంజ్ ఆఫర్ ని స్వీకరించి, తన అందంతో ఛాలెంజ్ గెలిచి తల్లితోపాటు అందరిని ఆశ్చర్యపరిచింది.ఇది జరిగింది మన భారతదేశంలో కాదు.ద గ్రేట్ బ్రిటన్ లో( The Great Britain ) జరిగింది.తల్లి ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తో రంగంలోకి దిగిన యువతి తన అందంతో అబ్బాయిలను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది.

ఒకరి తర్వాత ఒకరిని మారుస్తూ ఏకంగా ఏడాది తిరిగేలోపు 100 మందితో డేటింగ్ చేసింది.తర్వాత తల్లి నుండి 500 డాలర్లను( 500 Dollars ) సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని ఆ యువతి సోదరి ఎలిస్ కేరోలీన్( Alyse Carolyn ) స్వయంగా టిక్ టాక్ లో వెల్లడించడంతో ఇది కాస్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.ఈ వీడియోను చూసిన ఎంతోమంది నెటిజన్స్ ఇలాంటి తల్లి ఉండడం ఆ యువతి చేసుకున్న అదృష్టం అని ఆ తల్లి, కూతుర్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube