Fabrizio Villari Moroni : జాబ్ మానేశాక వర్షంలో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్‌..

సాధారణంగా జాబ్ పోతే చాలామంది బాగా బాధపడిపోతారు.జాబ్ పోయిన తర్వాత లేదంటే జాబ్ మానేయాల్సి వచ్చినప్పుడు ఉద్యోగులలో ఎక్కువగా బాధ, ఏడిపే కలుగుతుంది.

 A Man Who Danced In The Rain After Quitting His Job Video Went Viral-TeluguStop.com

కానీ ఒక వ్యక్తి మాత్రం జాబ్ మానేసి అదేదో మంచి విషయం లాగా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, ఫాబ్రిజియో విల్లారి మొరోని( Fabrizio Villari Moroni ) అనే ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్.అతడు వీడియోలను క్రియేట్ చేస్తూ చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.అయితే అతను ఇటీవల తన ఫుల్ టైమ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్యారిస్‌( Paris )లో వర్షంలో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.అంతేకాదు ఆ సంతోషకరమైన క్షణాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసాడు.

దానికి 4 లక్షల దాక లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో 100,000 కంటే ఎక్కువ మంది, టిక్‌టాక్‌లో 180,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

వీడియోలో “వర్షం పడుతోంది, ఇది చాలా అందమైన రోజు, నేను నా ఉద్యోగం మానేశాను!” అని ఫాబ్రిజియో చెప్పాడు.కంటెంట్ క్రియేషన్, రెగ్యులర్ వర్క్ రెండూ చేయలేనందున తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు క్యాప్షన్‌లో వివరించాడు.అతను జాబు విడిచి పెట్టకుండా ఉండాలని అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ ఏది వర్కౌట్ కాలేదు.తనను ఆదరించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవి తనను సంతోషపరుస్తున్నాయని చెప్పారు.

చాలా మంది అతని వీడియోపై వ్యాఖ్యానించారు.వారు తమ ఉద్యోగాలను విడిచిపెట్టినప్పుడు కూడా అలాగే సంతోషంగా ఫీలయ్యామని కొందరు చెప్పి షాక్ ఇచ్చారు.

కొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతాయని బాగా బాధపడినట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube