నార్త్ కరోలినా( North Carolina )లో ఒక వ్యక్తి తన కారులోని గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మేసి చివరికి ప్రాణాలను కోల్పోయాడు.గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ కూలిపోయిన ఓ వంతెనపై నుంచి అతడు తెలియకుండానే వెళ్ళాడు.
అది రాత్రి సమయం, అందులోనూ వర్షం కురవడం వల్ల పూర్తిగా గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడ్డాడు.అలా వెళ్తూ ఉన్న సమయంలో గూగుల్ ఒక వంతెన పైనుంచి వెళ్ళిపోవచ్చని సూచనలు చేసింది.
నిజానికి ఆ వంతెన ఎప్పుడో కూలిపోయింది.అది తెలియని అతను అలానే వెళ్ళిపోయి నీటిలో పడిపోయి చనిపోయాడు.

గూగుల్ కంపెనీ( Google Company )కి బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసినా తన నావిగేషన్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయలేదని పేర్కొంటూ ఆ వ్యక్తి కుటుంబం గూగుల్ నిర్లక్ష్యంపై దావా వేసింది.వివరాల్లోకి వెళ్తే.ఫిలిప్ పాక్సన్ అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు.అనంతరం ఇంటికి కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి పయనమయ్యాడు, అతను తొమ్మిదేళ్ల క్రితం కూలిపోయిన, పునర్నిర్మించని వంతెనను దాటచ్చని చెప్పిన గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరించాడు.
రహదారిపై బారికేడ్‌లు లేదా హెచ్చరిక సంకేతాలూ లేవు.దాంతో పాక్సన్ వంతెన అంచు నుంచి వెళ్లి క్రింద ఉన్న గుంటలో పడిపోయాడు.

గూగుల్ మ్యాప్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నావిగేషన్ యాప్‌లలో ఒకటి, అయితే ఈ సంఘటన డిజిటల్ నావిగేషన్ ( Digital Navigation )సాధనాలపై ఆధారపడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం పట్ల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.తెలియని ప్రాంతాలలో వినియోగదారులు ఎల్లప్పుడూ మార్గాలను వెరిఫై చేసుకోవాలి.గూగుల్, ఇతర నావిగేషన్ కంపెనీలు కూడా తమ సిస్టమ్‌లలో రెగ్యులర్ అప్‌డేట్‌లు, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అదనపు భద్రతా చర్యలను అమలు చేయాలి.