కుటుంబం సపోర్ట్ తో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్లు మంచి ఉద్యోగం సాధించడం కష్టం కాదు.అయితే ఒకవైపు వాచ్ మేన్ గా పని చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే మాత్రం గ్రేట్ అనే చెప్పాలి.
ప్రవీణ్( Praveen ) అనే యువకుడు రాత్రి సమయంలో వాచ్ మేన్ గా పని చేస్తూ కేవలం పదిరోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.పట్టుదలతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించడం సులువేనని ప్రవీణ్ ప్రూవ్ చేశారు.

ఓయూ( OU )లోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ లో నైట్ వాచ్ మేన్ గా పని చేస్తున్న ప్రవీణ్ టీజీటీ, పీజీటీ( TGT, PGT ) ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్( Junior Lecturer ) జాబ్ సాధించారు.ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎంతోమందికి ప్రవీణ్ స్పూర్తిగా నిలుస్తున్నారు.ప్రవీణ్ తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండటం గమనార్హం.

అయితే తాము కష్టపడినట్టు కొడుకు ప్రవీణ్ కష్టపడకూడదని భావించి ప్రవీణ్ చదువు కోసం పోసమ్మ, పెద్దులు ఎంతో కష్టపడి కొడుకును చదివించారు.అయితే తల్లీదండ్రులకు భారం కాకూడదని భావించిన ప్రవీణ్ గత ఐదేళ్లుగా వాచ్ మేన్ గా పని చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.మూడు ఉద్యోగాలలో ప్రవీణ్ ఏ ఉద్యోగాన్ని ఎంచుకుంటారో తెలియాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లా( Mancherial ) జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కు కొన్ని రోజుల గ్యాప్ లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో పొన్కల్ గ్రామస్తులు సంతోషిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువత ప్రవీణ్ ను స్పూర్తిగా తీసుకుంటే తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా సక్సెస్ సాధించే ఛాన్స్ ఉంటుంది.







