రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.ఈ క్రమంలో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు విద్యుత్ తో నడిచే వాహనాలకి మంచి డిమాండ్ ఏర్పడింది.దాంతో పలు కంపెనీలు ఎలక్ట్రికల్ బైక్స్, వాహనాలను రూపొందిస్తూ వాహనదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
అయితే విద్యుత్ రేట్లు కూడా భారీగా పెరిగిన తరుణంలో పైసా ఖర్చు లేకుండా సోలార్ సహాయంతో నడిచే వాహనాల గురించి ఇపుడు తెలుసుకుంటున్నారు.
అయితే కొంతమంది ఔత్సాహికులు అలాంటి వాహనాలను సొంతంగా తయారు చేసే పనిలో పడ్డారు.
ఇపుడు అలాంటి వ్యక్తి గురించే తెలుకోబోతున్నాం.అవును, మన తెనాలికి చెందిన ఒక కార్మికుడు.
పెట్రోల్, విద్యుత్ అవసరం లేకుండా కేవలం సూర్య రశ్మి సహాయంతో కార్పొరేట్ బ్రాండ్లకు ధీటుగా కారుని తయారు చేసి చూపించాడు.ఇంకేముంది సోలార్ కారులో మీకు నచ్చినప్పుడు హాయిగా బయటకు వెళ్ళవచ్చు అని చెబుతున్నాడు ఆ వ్యక్తి.

వివరాల్లోకి వెళితే… సోలార్ ఎనర్జీతో నడిచే ఆ కారుని తయారు చేసిన వ్యక్తి పేరు వెంకట్ నారాయణ.అతను ఒక కార్మికుడు కావడం విశేషం.బ్యాటరీ కారుని ఒకదాన్ని తీసుకుని దానికి సోలార్ ప్యానల్స్ ని బిగించి సోలార్ కారుగా మార్చేశారు.ఎండ ఉన్నంత సేపు ఆ కారు పైసా ఖర్చు లేకుండా నడుస్తుంది.
సూర్య రష్మి తగ్గిపోగానే వెంటనే బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని కారు నడుస్తుంది.కాబట్టి ఆ కారు మధ్యలో ఆగిపోతుందని మాట లేదు.
ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ సుమారు 150 కిలోమీటర్ల వరకు పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చునని చెబుతున్నాడు.







