Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ కోసం టీమ్ అంతా వైటింగ్.. ఎప్పుడు కరుణించేది?

ఈ నిర్మాత ఒక స్టార్ ప్రొడ్యూసర్.అయితే గతంలో గట్టి దెబ్బ తిన్నాడు.

 A. M. Rathnam Waiting For Pawan Kalyan, Pawan Kalyan, Hari Hara Veera Mallu, Dir-TeluguStop.com

ఒకానొక సమయంలో తమిళ్, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఈయన ఆ తర్వాత భారీ నష్టాల కారణంగా సినిమాలు మానేసి పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.అయితే ఇటీవలే మళ్ళీ అజిత్ కారణంగా సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటుందిగా.అతడే నిర్మాత ఏ ఎం రత్నం.

ఈయన ప్రెజెంట్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.ఆ సినిమానే హరిహర వీరమల్లు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కరోనా కంటే ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.కానీ అప్పటి నుండి ఆగిపోతూనే వస్తుంది.17 శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో తెరకెక్కుతుండగా కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే దొంగగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో గత కొన్నాళ్లుగా ఈ సినిమా సెట్స్ మీదనే ఉంది.ఇటీవలే వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ వెంటనే రామోజీ ఫిలిం సిటీలో షూట్ కూడా స్టార్ట్ చేసారు.

అయితే మళ్ళీ ఆపేసి రాజకీయాల్లో బిజీ అయ్యారు.

Telugu Rathnampawan, Amrathnam, Krish, Harihara, Pawan Kalyan-Movie

కంటిన్యూగా షూట్ జరుగుతుంది అని భావించిన నిర్మాతకు మళ్ళీ పవన్ హోల్డ్ లో పెట్టడం వల్ల చాలా లాస్ వస్తుందట.పవన్ షూట్ లో పాల్గొంటాడు అని భారీ సెట్స్ వేయించగా ఈయన గ్యాప్ ఇవ్వడంతో ఏ ఎం రత్నం ఇబ్బందులు పడుతున్నారని టాక్.పవన్ కోసం ఎదురు చూడడం మినహా ఏమీ చేయలేక పోతున్నారట.

మరి వీరిని ఎప్పుడు కరుణిస్తాడో.మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube