అరేబియా సముద్రంలో సేద తీరుతున్న సింహం.. పిక్ చూస్తే ఫిదా..!

గుజరాత్ ( Gujarath )తీరంలో హాయిగా సేద తీరుతున్న సింహం ఫోటో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ అద్భుతమైన ఫొటోను అప్‌లోడ్ చేశారు.

 A Lion Resting In The Arabian Sea, Lion, Gujarat Coast, Arabian Sea, Narnia Scen-TeluguStop.com

అందులో భారీ సింహం ఒడ్డున నిలబడి అరేబియా సముద్రాన్ని( Arabian Sea ) ఆస్వాదిస్తూ కనిపిస్తుంది.ఈ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూ చాలామందిని ఆకట్టుకుంటుంది.

చాలా మంది వ్యక్తులు ఈ గంభీరమైన సింహాన్ని చూసి వావ్ అడవికి రారాజు అంటే ఇలానే ఉంటాడు అని కామెంట్లు చేస్తున్నారు.

ఫొటోను ఆన్‌లైన్‌లో “నార్నియా నిజముగా కనిపించినప్పుడు.

గుజరాత్ తీరంలో అరేబియా సముద్రపు అలలను ఆస్వాదిస్తున్న సింహరాజు” క్యాప్షన్ తో ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేశారు.ఈ చిత్రం ప్రకృతి యొక్క అద్భుతమైన అందాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది, ఈ జంతువుల గురించి మరింత తెలుసుకోవాలనుకునే వ్యక్తుల కోసం కస్వాన్ రీసెర్చ్ డాక్యుమెంట్ కూడా పంచుకున్నారు.

పర్వీన్ కస్వాన్( Parveen Kaswan ) ఈ ఫోటోను పంచుకుంటూ “ఏషియాటిక్ సింహాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ పేపర్‌ను చదవగలరు.ఇది నేచర్ మేగజైన్‌లో ప్రచురించడం జరిగింది.” అని తెలిపారు.అయితే కొందరు నెటిజన్లు ఈ ఫోటోపై తమకున్న సందేహాలను వ్యక్తపరిచారు.“ఇది మామూలేనా? సముద్రంలోకి సింహాలు వస్తాయా? లేదా ఇది తప్పిపోయిందా?” అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు.“అద్భుతం! నార్నియాలో ప్రకృతి అద్భుతం.గుజరాత్ తీరంలో లయన్ కింగ్ రిలాక్సింగ్ ప్లేస్ ఇది.ఈ అందమైన ఫోటో తీసిన CCF, జునాగఢ్ ధన్యవాదాలు!” అని కామెంట్ చేశారు.రాజసం చూపిస్తున్న ఈ అద్భుతమైన సింహాన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube