ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మేధావులు బహిరంగ లేఖ రాశారు.ఈ మేరకు ఎనిమిది ప్రధాన డిమాండ్లతో 64 మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు లేఖను రాశారు.
గతంలో ప్రధాని ఇచ్చిన హామీలు ఏమీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలే స్థితికి చేరుకుందని విమర్శించారు.
కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని లేఖలో విన్నవించారు.
ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలని కోరారు.మతతత్వ ధోరణి విడనాడి ఐక్యతను కాపాడాలని, రాష్ట్రానికి సాప్ట్ వేర్ పార్క్ లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.