కంటి చూపుని కాపాడే ఆకు

సహజ సిద్దంగా తినే ఆహారం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక ఆకు కూరలని కలిపి తినడం వల్ల‌ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

వివిధ ఆకుకూరలలో అనేక రకాల పోషకాలు లభిస్తు ఉంటాయి.అలాంటి వాటిలో పొన్నగంటి ఆకు ఎంతో శ్రేష్ఠమైనది.

పొన్నగంటి ఆకులో ఏ , బి6, పోలేట్ , రైబో ప్లేవిన్, సి , ఇనుము, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.రోజు తినే ఆహారంలో పొన్నగంటి ని భాగం చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

ముఖ్యంగా కంటి చూపు మెరుగు పడటానికి ఈ పొన్నగంటి ఆకు దోహద పడుతుంది.ప్రస్తుత కాలంలో గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళకి కంటి కింద నల్లటి చారలు ఏర్పడతాయి.

Advertisement

అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఈ ఆకులని ఉడికించి మిరియాల పొడి కలుపుకుని తాగితే కంటికింది నల్లటి చారలు పోతాయి.అంతేకాదు ఈ కూరలో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది.

కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండే ఈ కూరలో లభించే నునే పదార్ధాలు గుండెకి రక్షణ ఇస్తాయి.బీపీ తగ్గిస్తుంది.

సన్నగా ఉండి బరువు పెరగాలని భావించే వాళ్ళు పప్పు చేసుకునే ముందు దానిలో ఈ పొన్నగంటిని కలిపి తినడం ద్వారా బరువు పెరుగుతారు.

ఈ రోజుల్లో అప్పు చేస్తే జీవితకాలం బకాయి తీర్చలేరా..
Advertisement

తాజా వార్తలు