ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో వైసీపీ అసెంబ్లీ మరియు Parliament జాబితాను ప్రకటించింది.ఈ మేరకు 175 శాసన సభ నియోజకవర్గాలతో పాటు 24 లోక్ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టింది.
వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్థుల ప్రకటన జరిగింది.వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు సీఎం జగన్.
ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా 50 శాతం స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు.రాష్ట్రంలో మహిళా సాధికారతతో పాటు సామాజిక న్యాయాన్ని వైసీపీ ( YCP )చేసి చూపిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ తరహాలోనే రాబోయే రోజుల్లో మరింతగా సామాజిక న్యాయాన్ని అందిస్తామని సీఎం జగన్ తెలిపారు.ప్రజల మీద నమ్మకంతో మార్పులు – చేర్పులు చేశామన్న సీఎం జగన్ టికెట్ రాని వారికి రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా వీటిలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు పదకొండు, ఓసీలకు 9 సీట్లను వైసీపీ కేటాయించింది.అదేవిధంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు కలిపి మొత్తం 200 సీట్లు ఉండగా వీటిలో 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం విశేషం.

200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59 మరియు ఓసీలకు వంద సీట్లను కేటాయించారు సీఎం జగన్( CM Jagan ).అంతేకాదు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే ఈసారి అదనంగా పదకొండు సీట్లును కేటాయించారు.2019 ఎన్నికలకు గానూ బీసీలకు మొత్తం 41 స్థానాలను కేటాయించిన వైసీపీ అధిష్టానం ఈసారి ఎన్నికల్లో బీసీలకు 48 సీట్లను కేటాయించింది.అలాగే మహిళలకు 2019లో 15 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ ఇప్పుడు మరో నాలుగు స్థానాలను పెంచింది.దాంతో పాటు 2019 లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చిన హైకామండ్ ఇప్పుడు మరో సీటు కలిపి మొత్తం ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది.2019 లో మైనార్టీలకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా.ఈ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు స్థానాలు పెంచింది.2019 లో ఎంపీ అభ్యర్థుల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు ఇస్తే.ఇప్పుడు బీసీలకు అదనంగా మరో నాలుగు సీట్లను కేటాయించింది.మొత్తం మీద 2019లో మహిళలకు 15 స్థానాలను కేటాయించిన సీఎం జగన్ 2024 లో మహిళలకు 19 స్థానాలను కేటాయించడం విశేషం.

అంతేకాకుండా ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఉన్నత విద్యావంతులే కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.మొత్తం 25ఎంపీ అభ్యర్థుల్లో 24 మందిని పార్టీ అధిష్టానం ప్రకటించింది.వీరిలో 88 శాతం మంది ఉన్నత విద్యావంతులేనని పేర్కొంది.24 మంది అభ్యర్థుల్లో ఐదుగురు వైద్యులు, నలుగురు న్యాయవాదులు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్ గా ఉన్నారు.మిగిలిన వారంతా గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.ఇక 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సుమారు 131 మంది చదువుకున్న వారే.వీరిలో 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లను సీఎం జగన్ కేటాయించారు.2024 ఎన్నికల బరిలో వైసీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల్లో 18 మంది వైద్యులు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లతో పాటు ఓ జర్నలిస్ట్, ఓ రక్షణ శాఖ మాజీ ఉద్యోగి ఉన్నారు.అంతేకాకుండా 2024 ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏకంగా 14 ఎమ్మెల్యే సీట్లను కేటాయించి సీఎం జగన్ తన మార్క్ ను మరోసారి చాటుకున్నారు.అభ్యర్థుల జాబితా ప్రకటనను రాష్ట్ర చరత్రలో ఎప్పుడూ జరగని ఘట్టంగా అభివర్ణించవచ్చని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం సీఎం జగన్ కే దక్కుతుంది.అదేవిధంగా సామాజిక న్యాయం మాటలకు పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి సాధ్యమేనని నిరూపించిన ప్రభుత్వంగా వైసీపీ సర్కార్ నిలిచిందని చెప్పుకోవచ్చు.