మాజీ మంత్రి వివేకానంద రెడ్డి( Vivekananda Reddy ) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి( Shivashankar Reddy ) బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అయితే హత్య కేసులో ఇటీవలే శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తీర్పును వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి( Suneetha Reddy ) అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.ఈ క్రమంలో సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఏ5 గా ఉన్నారు.