ఒక పెద్ద చీకటి రాకెట్, గుట్టుచప్పుడు కాకుండా వేల మంది అమ్మాయిల జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి.జరుగుతుంది అని తెలుసు కానీ ఎలా పట్టుకోవాలో తెలీదు.
అమ్మాయిలు నలిగి పోతున్నారని తెలుసు బతుకులను చింద్రం చేసుకున్నారని తెలుసు కానీ ఎలా బయట పడేయాలో తెలీదు.ప్రయత్నాల మీద ప్రయత్నాలు, సీక్రెట్ సోల్యూషన్స్ వెతికారు అయినా లాభం లేకపోయింది.
పట్టు విడవలేదు.వెతుకుతూనే ఉన్నారు.
కన్నంలో దాక్కున్న ఎలుక ఎప్పటికి అయినా బయటకు రావాల్సిందే అని పిల్లికి తెలుసు.నాసు పెట్టారు చివరికి ఆ ఎలుకను పట్టుకున్నారు.
ఆ ఎలుక వెల్లిన కన్నంలో ఉన్న రహస్యాలను, దారుణాలను చూసి పోలీస్ వ్యవస్థనే విస్తు పోయింది.ఒక్క అమ్మాయి కాదు ఇద్దరు కాదు వేలల్లో వేలల్లో అమ్మాయిలు ఆ చీకటి ఉబిలో ఇరుక్కుపోయారు.
రాక్షస సామాజ్రంలో చెలికత్తల్లా వారి మానాలను అమ్ముకున్నారు.
మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్, ఒక్క అలియాస్ కాదు అలియాస్ అభయ్, అలియాస్ అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.
సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఈ అలియాస్ ల వెనుక వచ్చిన పేర్లు.మనిషి ఒకడే కానీ పేర్లు మార్చుకొని వేలల్లో అమ్మాయిలను సెక్స్ వర్కర్లుగా మారుస్తూ చీకటి దందాను రాజులా ఏలాడు.! భారీ నెట్‌వర్క్‌తో పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ఇతడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు దొరికాడు.ఎంత తప్పించుకు తిరిగినా ఏదొ ఒక్క క్లూ ఎక్కడో ఒక దగ్గర మిస్టక్ చేసే ఉంటారు.
అలానే ఈ అదీమ్ కూడా దొరికిపోయాడు.ఇక దర్యాప్తులో భాగంగా ఇతని గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు.
ఫోన్లో ఏకంగా సుమారు 49వేల900 మంది యువతులు ఫొటోలు లభ్యమయ్యాయంటే ఏ స్థాయిలో ఈ చీకటి వ్యాపారం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.వీరందరినీ అదీమ్ వ్యభిచారం కోసం సంప్రదించినట్లు గుర్తించారు.
ఇతర నిందితుల ఫోన్లలోనూ వేలాది యువతుల చిత్రాలు ఉండడం చూసి అధికారులు నోరెల్ల బెట్టారు.
ఇతగాడు మామూలుగా దొరకలేదు.పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి రెండు నెలల ఆపరేషన్ తర్వాత వారికి చిక్కాడు.మహ్మద్ అదీమ్‌పై గచ్చిబౌలి, మాదాపూర్, అబిడ్స్, ఎస్‌ఆర్‌నగర్, రాయదుర్గం తదితర ఠాణాల్లో 10 కేసులున్నా పోలీసులకు చిక్కకుండా 2019 నుంచి కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
ఇంట్లో కూడా ఇతను ఏం చేస్తున్నాడో తెలియదు.వ్యభిచారం నిర్వహణలో తనకు సహకరించే మహిళతో సహజీవనం చేస్తుంటాడు.గతంలో హైదరాబాద్ పోలీసులు దాదాపు రెండు నెలలు వేటాడినా ఆచూకీ లభించలేదు.ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు భారీ వ్యూహమే పన్నారు.
తొలుత కొన్ని వ్యభిచార గృహాలపై దాడులు చేసిన సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు వాటి వెనుకున్న లింకులపై ఆరా తీయగా గుర్తింపు మార్చుకునే అదీమ్ గురించి తేలింది.స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లో ఆహారం ఆర్డర్ పెట్టినప్పుడు ముందుగా పేర్కొన్న చిరునామాకు బదులు.
అక్కడి నుంచి దూరంలో ఉండే చోటకు రమ్మని చెబుతాడని పోలీసులు చెప్పారు.ఈ నేపథ్యంలో ఎక్కడా పోలీసులు వస్తున్నారనే సమాచారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ముందు అతని చుట్టూ ఉన్న ఒక్కొక్క నెట్‌వర్క్‌ను ఛేదించి ఆ తర్వాత అతని ఇంట్లోనే అరెస్టు చేశారు.
అసలు ఈ దందా కు అమ్మాయిలను ఎలా లాగుతారు.
ఎలా కాంటాక్ట్ అవుతారు.కావాల్సిన వారి దగ్గరికి ఎలా పంపిస్తారంటే…ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు.వారి వివరాలను సేకరిస్తారు.ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతారు.
విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో పెడతారు.లొకాంటో, స్కోక్కా, మైహెవెన్‌మోడల్స్.
కామ్ నటాషారాయ్.ఇన్ వంటి కాల్‌గర్ల్స్ వెబ్‌సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు.
వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు.కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.
ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు.ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిస్తారు.
డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు.విటులు నగదు లేదా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలి.అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్ ప్రతినిధులకు ఇస్తారు.35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు.ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు.