తమిళనాడులో ( Tamil Nadu )భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.విరుద్ నగర్( Virud Nagar ) జిల్లాలోని బాణాసంచా గోడౌన్( Fireworks Godown ) లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు.మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే గాయపడ్డ బాధితులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి( Sivakasi Govt Hospital ) తరలించారు.
కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గోడౌన్ లో 150 మంది కార్మికులు ఉన్నారని సమాచారం.
.






