మనం కొన్ని వీడియోలు చూస్తుంటే ఆ వీడియోల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏవేవో జంతువులు ఎదురవడాన్ని చూస్తుంటాం.ఇక కొండ ప్రాంతాలు లేదంటే అటవీ ప్రాంతాల్లో అయితే ఇలాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇక ఎక్కువగా మనకు పాములు లేదంటే పులులు ఎదురయిన వీడియోలు మనకు కనిపిస్తుంటాయి.ఇక ఇప్పుడు కూడా ఓ రోడ్డుపై అనుకోకుండా ఓ ప్రాణి హల్‌చల్ చేసింది.
అయితే అది ఎవరూ ఊహించనటువంటి సంఘటన.ఎందుకంటే ఆ రోడ్డుపైకి ఓ అనకొండ వచ్చేసింది.
బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.ఎప్పుడూ ఫుల్ రద్దీగా ఉండే ఆ రోడ్డుపైకి అనుకోకుండా భారీ సైజులో ఉండే అనకొండ దర్శనమిచ్చింది.
ఇంకేముంది అటుగా వెల్తున్న జనాలు మొత్తం దాన్ని చూసి ఆగమాగం అయ్యారు.ఇక సెల్ ఫోన్లు ఉన్న వారు ఊరుకుంటారా వెంటనే దాన్ని వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈజీగానే వైరల్ అవుతోంది.
ఇక ఇందులో చూస్తే గనక దాదాపుగా 10 అడుగుల పొడవున్న భారీ అనకొండ సడెన్ గా రోడ్డుపై పాకుతూ వెళ్తోంది.

ఇక దాన్ని గమనించిన ఓ కారు ఓనర్ వెంటనే దాన్ని ఆపేసి అందర్నీ అక్కడే నిలిచిపోయేలా చూశాడు.ఇక అక్కడకు వచ్చిన వారంతా కూడా దాన్ని చూసి అలాగే ఉండిపోయారు.ఇక అందరూ చూస్తుండగానే ఆ పాము కాస్తా హైవే మధ్యలో ఉన్న డివైడర్ చుట్టూరా తిరుగుతూ బెదిరిపోయి పాక్కుంటూ రోడ్డు అవతల ఉన్న పొదల్లోకి యమ ఫాస్ట్ గా వెళ్లిపోయింది.
ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగానే విపరీతంగా వైలర్ అవుతోంది.దాదాపుగా మిలియన్ల వ్యూస్ సాధించింది ఇప్పటికే.ఇక నెటిజన్లు అయితే షాక్ అవుతున్నట్టు కామెంట్లు కూడా పెడుతున్నారు.







