BRS : అసెంబ్లీ స్పీకర్ ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం..!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేల బృందం కలవనుంది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Dana Nagender ) పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరనున్నారు.

రాజీనామా చేయకుండా దానం నాగేందర్ పార్టీ ఎలా మారుతారని మండిపడుతున్నారు.అయితే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ( Gaddam Prasad Kumar )సమయం ఇచ్చినప్పటికీ వారు కలవలేదు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయనున్న ఫిర్యాదుపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ( Dipadas Munshi ) సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు