సాధారణంగా చేపలు( Fish ) నీళ్లలో మాత్రమే బతుకుతాయి కానీ ఒక చేప మాత్రం ఇసుకలో కూడా ప్రయాణిస్తుంది.భూమిపై కూడా అదే నడుస్తూ ఎక్కడికంటే అక్కడికి వెళుతుంది.
దీనినే నియోట్రోపికల్ ఆర్మర్డ్ క్యాట్ ఫిష్ అంటారు.ఇది మధ్య, దక్షిణ అమెరికా( South America )లోని మంచినీటి ఆవాసాలలో నివసించే చేప.భూమిపైకి వెళ్లి ప్రయాణాలు చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి ఈ సామర్థ్యం చేపలలో ఉండటం చాలా అరుదు.ఇవి “రిఫ్లింగ్” అని పిలిచే ఒక ప్రత్యేకమైన లోకోమోషన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తాయి.
ఈ టెక్నిక్‌లో పెక్టోరల్ రెక్కలను భూమిలోకి పెట్టి నెట్టడం, వంపు లాంటి చలనాన్ని సృష్టించడం వంటివి ఉంటాయి.ఈ కదలిక ఈత కొట్టడం, జారడం లేదా క్రాల్ చేయడం కంటే భిన్నంగా ఉంటుంది.
పరిశోధకులు దీనిని వివరించడానికి కొత్త పదాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.
ఈ చేప ఎడారిలో కూడా నడుచుకుంటూ వెళ్లగలదు.అది ఎలా వాకింగ్ చేస్తుందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. Gunsnrosesgirl3 అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది దీనికి ఇప్పటికే 24 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి దీనిని ఓపెన్ చేస్తే ఒక చేప ఇసుకలో దాని రెక్కలను ఆడిస్తూ ముందుకు వెళ్లడం మనం గమనించవచ్చు.
ఈ చేపలు ఎడారిలో కూడా బతకగలవు అన్నట్లు వీడియోలో ఒక ఆథార్ చెప్పడం మనం వినవచ్చు.
రిఫ్లింగ్ టెక్నిక్( Rifling ) క్యాట్ ఫిష్ నీటి వనరుల మధ్య ప్రయాణించడానికి అనుమతిస్తుంది, ముఖ్యంగా పొడి సీజన్లలో వాటి ఆవాసాలు తగ్గిపోవచ్చు లేదా అదృశ్యం కావచ్చు.అయినా గాలిని కూడా పీల్చుకోగలవు ఇది భూమిపై ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.వాటి రెక్కలు కఠినమైనవి, కవచంలా ఉంటాయి, ఇవి వాటిని వేటాడే జంతువులు, కఠినమైన పరిస్థితుల నుండి కాపాడతాయి.
వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.