అన్ లైన్ లో ఫేక్ ప్రోడక్ట్ లను కనిపెట్టే ఫీచర్ ప్రింట్ యాప్..!

A Feature Print App That Detects Fake Products Online , Fake Products Online, Alitheon, Traditional Product Identification Methods, Print App, Technology

ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేసే వారి సంఖ్య కంటే ఆన్లైన్ లో షాపింగ్ చేసి వారే చాలా ఎక్కువగా ఉన్నారు.

 A Feature Print App That Detects Fake Products Online , Fake Products Online, Al-TeluguStop.com

అయితే ఆన్ లైన్ లో నకిలీ ప్రొడక్ట్లు వస్తూ ఉండడంతో ఎంతోమందికి ఒరిజినల్ కి, నకిలీకి మధ్య తేడా గుర్తించడం సవాలుగా మారింది.బయటకొనేందుకు సమయం ఉండదు.

ఆన్ లైన్లో కొంటే నకిలీ ప్రొడక్ట్స్ వస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.అయితే ఈ సమస్యకు ఇక చెక్ పడినట్టే.

Telugu Alitheon, Products, Latest Telugu, Print App-Technology Telugu

అమెరికాకు చెందిన అలిథియోన్( Alitheon ) అనే కంపెనీ ఫీచర్ ప్రింట్ అనే యాప్ ను సరికొత్తగా డెవలప్ చేసింది.ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ఉపయోగించి డివైస్ కెమెరా సహాయంతో నకిలీ ప్రోడక్ట్ లను గుర్తించవచ్చు.ఇది ట్రెడిషనల్ ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ మెథడ్స్( Traditional Product Identification Methods ) కి భిన్నంగా పనిచేస్తుంది.ప్రాడక్టులను అనలైజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అల్గారిథంలను ఉపయోగిస్తుంది.

ఈ యాప్ నకలి ప్రోడక్ట్లను గుర్తించడమే కాక దెబ్బతిన్న లేదా మిస్ అయిన భాగాలను కూడా కనిపెడుతుంది.

Telugu Alitheon, Products, Latest Telugu, Print App-Technology Telugu

ఈ ఫీచర్ ప్రింట్ యాప్ ( Print app )ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి మాత్రమే కాదు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలకు కూడా ఉపయోగపడుతుంది.ఈ కామర్స్ కంపెనీల బ్రాండ్ రెప్యూటేషన్ కాపాడుకోవడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.నకిలీ ప్రోడక్టులు చలామణిలో ఉండడంతో ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి.

ఈ సమస్యకు చక్కటి పరిష్కారం త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ ప్రింట్ యాప్ పురాతన వస్తువులను, బంగారాన్ని, ఎక్కువ ఖరీదైన వస్తువులను ఇట్టే గుర్తిస్తుంది.

భవిష్యత్తులో నకిలీ స్కామ్ ల బారిన పడే ప్రమాదల నుండి రక్షణ కల్పిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube