నంద్యాల జిల్లా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటనలో ఓ రైతుకు చేదు అనుభవం.పాములపాడు మండలం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ను సందర్శించేందుకు మంత్రి వచ్చాడు.
అయితే అక్కడికి మంత్రి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఎర్రగూడూరు గ్రామానికి చెందిన రైతు తన సమస్యను మంత్రి గారికి తెలిపేటందుకు వినతి పత్రంతో మంత్రికి ఇచ్చే ప్రయత్నం చేసాడు.
కానీ మంత్రి ఆ రైతు ఇచ్చే వినతి పత్రం తీసుకోగపోగా అతన్ని పక్కకు నెట్టడంతో అక్కడే వున్నా పోలీసులు రైతును లాక్కొని వెళ్లారు.
ఈ ఘటన చుసిన స్థానికులు మంత్రిగారు ప్రవర్తించిన తీరుపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.