కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ పాదయాత్రగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి నడుస్తూ ఉన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాలను కవర్ చేసే రీతిలో చేస్తున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం కేరళలో జరుగుతుంది.ఈ సందర్భంగా కేరళ భారత్ జూడో యాత్రలో బీజేపీ పై రాహుల్ గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మన దేశానికి సంబంధించి వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని.ప్రధాని మోడీ చైనాకి అప్పగించారని ఆరోపించారు.ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో… కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.భారత్ జూడో యాత్రలో రాహుల్ బీజేపీ పై భారీ ఎత్తున విమర్శల దాడి చేస్తున్నారు.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్రకి అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు బాగానే లభిస్తుంది. ఈ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.







