సింగర్ చిన్మయి( Chinmayi ) శ్రీ పాదపై హైదరాబాద్ లో కేసు నమోదు అయింది.ఈ మేరకు హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్( HCU student Kumar Sagar ) ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
భారత్ పై సింగర్ చిన్మయి శ్రీ పాద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ( Annapoorna Amma )కు చిన్మయి కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే భారతదేశంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేశారని హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో చిన్మయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని సమాచారం.