కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో నిన్న టీడీపీ నేతలు సంబురాలు నిర్వహించారు.ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని అసభ్య పదజాలంతో దూషించారని ఎస్సై గౌతమ్ ఫిర్యాదు చేశారు.353, 341, 285, 290, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.