ఢిల్లీలోని కబీర్‌నగర్( Kabir Nagar )లో ఓ భవనం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా.
మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
అనంతరం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తోంది.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భవనంలో కార్మికులు( Workers ) పనులు చేస్తున్నట్లు సమాచారం.కాగా శిథిలాల కింద మరి కొంతమంది కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.