తల్లితండ్రులను కాదని లవర్ తో వెళ్లిపోయే అమ్మాయికి ఓ యువకుడి ప్రశ్న ఇదే.! మీరే ఆలోచించండి!

తల్లితండ్రులకు చెప్పకుండా ఎవడో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న.

 A Boy Questions To Girl Over Her Love-TeluguStop.com

నీ ప్రేమ ఎలా గొప్పది?
రక్త మాంసాలు కడుపున మోస్తూ
నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ
సమయం అయ్యింది నన్నింక బయటకు వదలమని నువ్వు ఆ కడుపులో కాళ్లతో తంతుంటే
ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి
నీకోసం తన ప్రాణాలకు తెగించి
శంకరా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించు అని
నీకు జన్మనిచ్చిన………
ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా.?
నువు పుట్టిన క్షణం నుంచి నీకోసం ఆలోచిస్తూ
నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూపెడుతూ
నీకు బాధ వేస్తె తన బాధగా భరిస్తూ
నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ
ఎండనకా వాననకా కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ

నువ్వు ఏది అడిగినా కాదనకా తన స్వేదాన్ని నీ సంతోషంగా మారుస్తూ…
అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే
ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నీ ప్రేమ ఎలా గొప్పది??
4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం ఇది…
((ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన(లేచిపోయిన అనడం సమంజసం ఏమో) కూతుర్ని తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ అమ్మనాన్నలు.
బయటకు వస్తే నీ కూతురు ఎక్కడ అని ఇరుగుపొరుగు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు రాను భయపడి విలపిస్తున్న ఆ అమ్మానాన్నలు.
ఎవరైనా దగ్గరి ఆత్మీయులు ఓదార్చటానికి వెళ్తే, నా గుండెలపై ఎక్కించుకొని పెంచానయ్య నా బిడ్డను అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ నాన్న బాధను.
తలుపు చప్పుడు వస్తే నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో వెళ్లి చూసి ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను.

చూశాక మనసు చలించి…నేను అడిగిన సూటి ప్రశ్న ఇది
అమ్మాయిలూ… ఇంటినుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్క క్షణం మీ అమ్మనాన్న ల గురించి ఆలోచించండి….
ఇది చదివాక అందరూ మారకున్న ఒక్కరైనా ఆలోచిస్తారని ఆశిస్తూ…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube