ఈ పువ్వులను పూజకు వాడకూడదు..వాడినట్లైతే భగవంతుని అనుగ్రహం లభించదు..

ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ,గుడికి వెళ్లినప్పుడు కాని దేవుడికి సమర్పించేవాటిలో పూలది ప్రధమ స్థానం.అటువంటి పూలను దేవుడికి సమర్పించేటపుడు ఏ పూలు పడితే ఆ పూలతో పూజ చేయకూడదట.

 Everything You Need To Know About Flowers Offered To Hindu Deities-TeluguStop.com

చాలామంది ఇంట్లో మొక్కలనుండి తెంపిన పూలను పూజకు వినియోగస్తారు.లేదంటే బయట కొని వాటితో పూజ చేస్తారు.

కాని ఆ పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలట.ఆ నియమాలేవో పాటించి ఈ సారి పూజ చేసేటప్పుడు ఆ తప్పులు చేయకండి.

దేవుడికి పూజ చేసేటప్పుడు సమర్పించకూడని పువ్వులు.

· ఎటువంటి వాసన లేని పూలను,అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట.

· అలాగే ముళ్లు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు.

· వాడిపోయిన పూవులను పూజకు వాడితే అశుభం,కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి.

· పరిశుభ్రమైన .పవిత్రమైన ప్రదేశాల్లో లేని పూల మొక్కల నుంచి కోసిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు.

· నేలపై పడిన పూలు, పురుగు పట్టిన పూలు,పూర్తిగా వికసించని పూలు దేవుడి పూజకు పనికిరావు.

· హిందువులు కుడిని శుభంగాను,ఎడమను అశుభంగాను పరిగణిస్తారు.

అదేవిధంగా భగవంతుడి పూజకు ఉపయోగించే పూలను ఎడమ చేత కోసినట్లైతే పూలు భగవంతుడి పూజకు పనికి రావని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

· పరిశుభ్రమైన .పవిత్రమైన ప్రదేశంలోని చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి.ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందనేది మహర్షుల మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube