దారుణం: నీ శీలం పోయింది ఇంక నువ్వు బ్రతకడం వేస్ట్ అంటూ....

ఈ సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నరంటే తన ప్రమేయం ఏమీ లేకుండా జరిగిన తప్పుకి బాధితురాలు వైపు నిలబడి అండదండలు అందించాల్సిన వారే అన్యాయంగా వేధింపులకు గురి చేస్తున్నారు.తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అభంశుభం తెలియని బాలికపై ఓ  కామాంధుడి చేసిన అఘాయిత్యానికి నిందితున్ని శిక్షించాల్సిందే పోయి చివరికి ప్రేమించిన వాడే బాధితురాలుకి విషం ఇచ్చి హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది….

Telugu Andhra Pradesh, Andhrapradesh, Friend, Godavari, Godavari Latest-Latest N

వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది.ఈ బాలిక తల్లిదండ్రులు గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు.అయితే ఈనెల ఏడవ తారీఖున గ్రామంలోని ఓ ఆలయంలో జరిగే భజన కార్యక్రమానికి బాలిక వెళ్లి వస్తుండగా గ్రామంలోని మానికల రాజు అనే వ్యక్తి ఆమెను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అంతేగాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఆమె తన ప్రియుడుకి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలియజేసింది.

అయితే ఆ ప్రియుడు అఘాయిత్యం జరిగిన బాలికకు తన అండగా నిలబడాల్సింది పోయి తనను దారుణంగా వేధించాడు.అంతేకాక “నీ శీలం పోయింది ఇంక నువ్వు బతికి ఉండటం వేస్ట్” అని అంటూ సూటిపోటి మాటలతో చిత్రవద చేశాడు.

ఈ క్రమంలో బాలికకు కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడు.అయితే విషం కలిపిన విషయం తెలియక ఆ బాలిక కూల్ డ్రింక్ ని సేవించి బాలిక అపస్మారక స్థితిలో కి వెళ్ళిపోయింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తమై దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలిక మృతి చెందింది.సమాచారం అందుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు మానికల రాజును మరియు బాలిక మృతికి కారణమైన ప్రియుడు సుబ్రమణ్యం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube