దారుణం: నీ శీలం పోయింది ఇంక నువ్వు బ్రతకడం వేస్ట్ అంటూ....
TeluguStop.com
ఈ సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నరంటే తన ప్రమేయం ఏమీ లేకుండా జరిగిన తప్పుకి బాధితురాలు వైపు నిలబడి అండదండలు అందించాల్సిన వారే అన్యాయంగా వేధింపులకు గురి చేస్తున్నారు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అభంశుభం తెలియని బాలికపై ఓ కామాంధుడి చేసిన అఘాయిత్యానికి నిందితున్ని శిక్షించాల్సిందే పోయి చివరికి ప్రేమించిన వాడే బాధితురాలుకి విషం ఇచ్చి హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
"""/" /
వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది.
ఈ బాలిక తల్లిదండ్రులు గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు.
అయితే ఈనెల ఏడవ తారీఖున గ్రామంలోని ఓ ఆలయంలో జరిగే భజన కార్యక్రమానికి బాలిక వెళ్లి వస్తుండగా గ్రామంలోని మానికల రాజు అనే వ్యక్తి ఆమెను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అంతేగాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఆమె తన ప్రియుడుకి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలియజేసింది.
అయితే ఆ ప్రియుడు అఘాయిత్యం జరిగిన బాలికకు తన అండగా నిలబడాల్సింది పోయి తనను దారుణంగా వేధించాడు.
అంతేకాక "నీ శీలం పోయింది ఇంక నువ్వు బతికి ఉండటం వేస్ట్" అని అంటూ సూటిపోటి మాటలతో చిత్రవద చేశాడు.
ఈ క్రమంలో బాలికకు కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడు.అయితే విషం కలిపిన విషయం తెలియక ఆ బాలిక కూల్ డ్రింక్ ని సేవించి బాలిక అపస్మారక స్థితిలో కి వెళ్ళిపోయింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తమై దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలిక మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు మానికల రాజును మరియు బాలిక మృతికి కారణమైన ప్రియుడు సుబ్రమణ్యం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.