హ్యాపీ, లాంగ్ లైఫ్ కోసం 5 టిప్స్ పంచుకున్న 100 ఏళ్ల వృద్ధుడు.. పోస్ట్ వైరల్...

వందేళ్ల జీవితాన్ని ఒక అడ్వెంచర్‌గా గడిపిన వ్యక్తులు చెప్పే సలహాలు యువకులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.తాజాగా అలాంటి ఒక వ్యక్తి హ్యాపీ లైఫ్ కోసం ఐదు టిప్స్ పంచుకున్నాడు.

ఆయన పేరు జాక్ వాన్ నోర్‌హీమ్( Jack Van Norheim ).100 ఏళ్ల పాటు అసాధారణమైన జీవితాన్ని గడిపిన ఈ వృద్ధుడు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాడు, ఒక కోతిని పెంచుతూ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఈ వ్యక్తి ఒక యానిమల్ లవర్.

జులై 31న లాస్ ఏంజెల్స్ ( Los Angeles )జూలో తన 100వ పుట్టినరోజును జరుపుకున్నాడు.రీసెంట్‌గా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన జీవిత విశేషాలు, జోకులు, లైఫ్ లాంగ్ జీవించడానికి చిట్కాలను పంచుకున్నాడు.అవేవో చూసేద్దాం పదండి.1.డార్క్ చాక్లెట్, తేనె తినాలని జాక్ చెబుతున్నాడు.

రోజుకు రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ తాను తింటానని చెప్పాడు.ఇవి రెండూ గుండెకు మేలు చేస్తాయని అన్నాడు.

ఇవి తినడం వల్ల మానసిక పరిస్థితి కూడా బాగుంటుందని అన్నాడు.

Advertisement

2.బయటికి వెళ్లండి, ఫోన్‌తో జీవితం గడపవద్దని చెబుతున్నాడు జాక్.స్మార్ట్‌ఫోన్లను "మ్యాజిక్ మిర్రర్స్"( Magic Mirrors ) అని పిలుస్తూ అవి చెడ్డవి అని చెప్పాడు.

ప్రకృతిని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలని సూచించాడు.ఆరుబయట ఉండటం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పాడు.3.ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ హోమ్ ఫుడ్ ( Home food )మాత్రమే తీసుకోవాలని జాక్ సలహా ఇచ్చాడు.

తాను ఇంట్లో వండిన భోజనం తింటూ పెరిగానని అందుకే వందేళ్లు బతికానని అన్నాడు.

4.కొద్దిగా మద్యం మాత్రమే తాగాలి, వీలైతే కొంచెం కూడా తాగకుండా బతకాలని అడ్వైస్ ఇచ్చాడు జాక్.ఇది చాలా హానికరమైన హెచ్చరించాడు.5.ప్రియమైన వారితో సమయం గడపడం చాలా ముఖ్యమని జాక్ చెప్పాడు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
అదిగో అన్నారు ఇదిగో అన్నారు... వాయిదా వేశారంటయ్యా ? 

ఈ వృద్ధుడు వివాహం చేసుకోలేదు, పిల్లలను కనలేదు కానీ అతను తన తల్లిదండ్రులతో క్లోజ్ గా ఉన్నాడు.బలమైన సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు తేల్చినట్లు జాక్ గుర్తు చేశాడు.

Advertisement

తాజా వార్తలు