ప్రతి హీరో కెరియర్లోను కొన్ని మైల్ స్టోన్స్ వుంటాయి.తమ 50వ సినిమా … 75వ సినిమా… 100వ సినిమా అంటూ ఆ సంఖ్యకు చేరిన సమయంలో వాటిని గ్రాండుగా, మెమరబుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా చేస్తుండగా, బాలకృష్ణ 100వ సినిమా చేస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకి చేరువవుతున్నారు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘బాబు బంగారం’ 74వ సినిమా.సో, దీంతో తన 75వ చిత్రాన్ని ఆయన భారీగానే ప్లాన్ చేస్తున్నారు.
దీనికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజక్టుకు సంబంధించి పూరీ ఇటీవల చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో దానిని డెవలప్ చేయమని వెంకీ చెప్పినట్టు సమాచారం.
అన్నీ అనుకూలిస్తే ప్రస్తుతం తాను కల్యాణ్ రామ్ తో చేయనున్న చిత్రం తర్వాత వెంకటేశ్ చిత్రాన్నే పూరీ చేయచ్చని అంటున్నారు.
సూపర్బ్ సినిమా – వెంకటేశ్ హీరో- పూరి డైరెక్టర్







