అగ్రదర్శకుడు పూరి జగన్నాథ్, ఒకనాటి క్రేజీ హీరోయిన్ ఛార్మిల మధ్య ఉన్న స్నేహం గురించి మనకి తెలియనిది కాదు.ఆ స్నేహం వల్లే తాను హిందీలో అమితాబ్ బచ్చన్ తో తీసిన “బుడ్డా హోగా తెరా బాప్” లో ఛార్మికి అవకాశం ఇచ్చాడు పూరి.
ఆ స్నేహం వల్లే, క్రేజీ కథానాయకులతో మాత్రమే సినిమాలు తీసే పూరి, “జ్యోతిలక్ష్మీ” అంటూ ఛార్మితో లేడి ఓరియెంటెడ్ సినిమా తీశాడు.ఇప్పుడు ఆ స్నేహం వల్లే పూరి కోసం ఒక పని చేసిపెట్టింది ఛార్మి.
ఏప్రిల్ మొదట్లోనే, “జనగణమన” అనే టైటిల్ ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించింది ఛార్మి.ఆ టైటిల్ తో మళ్ళీ ఏదైనా లేడి ఓరియెంటెడ్ సినిమా తీస్తుందేమో అనుకున్నారంతా.
కట్ చేస్తే పోకిరి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “జనగణమన” టైటిల్ తో సూపర్ స్టార్ ని మూడోసారి డైరెక్ట్ చేయనున్నట్లు ప్రకటించేశాడు పూరి.అప్పుడు అర్థమయ్యింది, ఛార్మి ఆ టైటిల్ ని తనకోసం కాదు, మహేష్ కోసం, పూరి కోసం రిజిస్టర్ చేయించిందని.
చూసారా, ఇండస్ట్రీలో స్నేహితులు ఉంటే ఎంత లాభమో! ఇదే టైటిల్ వేరే ఎవరో రిజిస్టర్ చేయించి ఉంటే, ఆ టైటిల్ పొందడానికి పూరి నానా తంటాలు పడాల్సి వచ్చేది.







