యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘జతన గ్యారేజ్’.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆగస్టులో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు అంతా కూడా భారీ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక కొరటాల శివ గత చిత్రం ‘శ్రీమంతుడు’కు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చిన విషయం తెల్సిందే.
ఆ సినిమా మాదిరిగానే జనతగ్యారేజ్‌ను సైతం ఓవర్సీస్‌లో భారీగా ప్రమోషన్ చేయాలని భావిస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు మైత్రి మూవీస్ వారు అక్కడ ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.గతంలో ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరించిన మైత్రి మూవీస్ వారికి అక్కడ బాగానే పట్టు ఉంది.
దానికి తోడు అక్కడ ఆడియో విడుదలతో పాటు పలు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తప్పకుండా ‘శ్రీమంతుడు’ కంటే అత్యధిక కలెక్షన్స్ జనత గ్యారేజ్ రాబట్టే అవకాశాలున్నాయని మైత్రి మూవీస్ వారు భావిస్తున్నారు.
అయితే ‘జనత గ్యారేజ్’ ఆడియో అమెరికాలో నిర్వహించడాన్ని నందమూరి ఫ్యాన్స్ తప్పు బడుతున్నారు.
ఎన్టీఆర్ సినిమా ఆడియోను ఇక్కడే విడుదల చేయాలని వారు కోరుకుంటున్నారు.మునుపటి సినిమాల కంటే భారీ స్థాయిలో ఆడియోను ఇక్కడే విడుదల చేయాలని నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులు అంటున్నారు.
మరి ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.








