నాగచైతన్య, సమంతలది హిట్ పెయిర్ అని చెప్పవచ్చు.వీరిద్దరు ఇప్పటి వరకు ‘ఏమాయ చేశావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెల్సిందే.
ఆ మూడు సినిమాల్లో రెండు సూపర్ హిట్ కాగా, ఒకటి పర్వాలేదు అనే టాక్‌ను దక్కించుకుంది.ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో నాల్గవ సినిమా వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజాగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తర్వాత సినిమాను నాగచైతన్యతో చేయబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యే ఛాన్స్ ఉంది.ఆ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేయబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ కృష్ణ వైవిధ్యభరిత కథాంశంను సిద్దం చేశాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఆ కథాంశంకు చైతూతో పాటు సమంత అయితేనే బాగా సూట్ అవుతుందని, అందుకే సమంత చాలా బిజీగా ఉన్నా కూడా ఆమె డేట్లు కోరి మరీ నాగార్జున తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
చైతూ మరియు నాగార్జునలతో ఉన్న సన్నిహిత సంబంధంతో బిజీగా ఉన్నా సమంత డేట్లు కేటాయించినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ మరియు ‘ప్రేమమ్’ చిత్రాలు విడుదల అయిన తర్వాత చైతూ, సమంతల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.







