వైకాపా లోంచి మరొక ఎమ్మెల్యే జంప్ ?

ఏపీలో అధికార టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు.ఇప్పటికే విపక్ష వైసీపీ టికెట్ పై విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు.

 Another Mla Ready To Jump From Yscp-TeluguStop.com

విడతలవారీగా జరిగిన ఈ ‘జంపింగ్’ల్లో వైసీపీలో కీలక నేతలుగా ఎదిగిన భూమా నాగిరెడ్ది, జ్యోతుల నెహ్రూ తదితరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కిచ్చారు

తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.ఈ విషయం వెలుగు చూసిన వైనం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో అశోక్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారనే వాదన వినిపిస్తున్నా, ఎక్కడా ఆ వార్త బయటకు పొక్కలేదు.అయితే గిద్దలూరు టీడీపీ నేతలకు ఈ విషయం చేరిపోయింది.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నియోజకవర్గ నేతలు… ఆదివారం నేరుగా హైదరాబాదు వచ్చారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు.

అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube