సినీ నటుడు వేణు తొట్టెంపూడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే…ఇరాన్ కు చెందిన డాక్టర్ ఫాతిమా బేగంపేటలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 10లో జేపీ రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 302 ను ఏడు నెలల క్రితం సినీ నటుడు వేణు తొట్టెంపూడి నుంచి ఆమె అద్దెకు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె అడ్వాన్స్ గా 88 వేల రూపాయలు చెల్లించారు.
ప్రతి నెలా 29,300 రూపాయల అద్దె చెల్లిస్తున్నారు.అయితే ఈ నెల 8న ఆమె ఖాళీ చేస్తున్నట్టు యజమాని వేణుకు తెలిపారు.
ఫ్లోర్ పై చిన్న బీటలు ఏర్పడ్డాయని, వాటిని సరిచేసేవరకు అడ్వాన్స్ ఇచ్చేది లేదని వేణుతో పాటు అతని భార్య అనుపమ చౌదరి కరాఖండిగా చెప్పారు.దీంతో ఫాతిమా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.
.






