పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో శరత్ మారార్ నిర్మిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’.ఈ చిత్రం షూటింగ్ నిన్నటి వరకు యూరప్‌లో జరిగిన విషయం తెల్సిందే.
అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇండియాకు బయలుజేరింది.మరి కొన్ని గంటల్లోనే సర్దార్ టీం ఇండియాలో ల్యాండ్ కానున్నట్లుగా తెలుస్తోంది.
మూడు పాటలను కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే చిత్రీకరించి, యూనిట్ సభ్యులు తిరిగి వస్తున్నారు.ఒక వైపు చిత్రీకరణ చేస్తూనే మరో వైపు లైవ్ ఎడిటింగ్ జరిపారు.
చిత్రీకరణ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.అయితే తాజాగా చిత్రీకరణ అవ్వడంతో సర్దార్ వాయిదా ప్రసక్తే లేదు అని తేలిపోయింది.
ఏప్రిల్ 8న ఎట్టి పరిస్థితుల్లో సర్దార్ థియేటర్లలో సందడి చేయడం ఖాయం అయ్యింది.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
సంజన ముఖ్య పాత్రలో కనిపిస్తోంది.







