యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత సంవత్సరం ‘టెంపర్’ చిత్రంతో దుమ్ము రేపిన విషయం తెల్సిందే.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన తారా స్థాయిలో ఉంది.
ఎన్టీఆర్ దుమ్ము రేపే నటనతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టింది.
దాంతో తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగులో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేయబోతున్నట్లుగా మొదట మీడియాలో వార్తలు వచ్చాయి.
కాని శింబు స్థానంలో మరో హీరో వచ్చి చేరాడు.శింబు హీరోగా ‘టెంపర్’ చిత్రం రీమేక్ అవ్వబోతున్నట్లుగా వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని, ఈ చిత్రం రీమేక్ కాబోతున్న విషయం నిజమే కాని, హీరోగా మాత్రం శింబు కాదని, ప్రస్తుతం విశాల్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా నిర్మాత చెప్పుకొచ్చాడు.
తెలుగు నిర్మాతలు ఠాగూర్ మధు మరియు నల్లమల్లపు బుజ్జిలు ఈ చిత్రం నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రదర్శించిన ఎమోషనల్ యాక్టింగ్‌ను విశాల్ అయితేనే బాగా ప్రదర్శిస్తాడు అనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.
అతి త్వరలోనే ‘టెంపర్’ తమిళ రీమేక్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.







