మెగా బ్రదర్స్ మధ్య ఉన్న విభేదాలు తొలగి పోయాయి.కొన్నాళ్ల క్రితం వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోని మెగా బ్రదర్స్ ప్రస్తుతం జత కట్టి మరీ తిరుగుతున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ చిత్రం సెట్స్‌కు చిరంజీవి రెండు మూడు సార్లు వచ్చిన విషయం తెల్సిందే.ఆ తర్వాత కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు పలుసార్లు కలుసుకున్నట్లుగా మెగా వర్గాల ద్వారా తెలుస్తోంది.
అన్నదమ్ముల మధ్య సన్నిహిత్యం పెరగడంతో త్వరలో విడుదల కాబోతున్న సర్దార్ ఆడియో వేడుకకు చిరంజీవి హాజరు అవ్వడం ఖాయం అని తేలిపోయింది.
ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు ఆడియో విడుదలకు చిరంజీవి హాజరు అవ్వనున్నాడు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కూడా ఆ విషయంపై అనధికారికంగా ఒక క్లారిటీ ఇస్తున్నారు.
దాంతో మెగా ఫ్యాన్స్ ఈ వేడుకకు భారీ స్థాయిలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.మెగా ఫ్యాన్స్‌కు మెగా బ్రదర్స్ కలిసి ఉంటే పండుగే.
సర్దార్ కోసం ఇద్దరు అన్నదమ్ములు కలవబోతుండటంతో మెగాఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేందుకు సిద్దం అవుతున్నారు.సినిమాను వచ్చే నెలలో విడుదల చేయబోతుండగా, ఆడియోను ఈనెల 20న విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేశారు.







