స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సాధించిన దిల్ రాజు.ఇప్పుడు కాస్ట్ కటింగ్ లో పడ్డాడనే టాక్ వినిపిస్తోంది.
తన ప్రొడక్షన్ హౌజ్ లో ముగ్గురిని తొలగించాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు తీయబోవడం లేదని అందుకే టీం మెంబర్ల సంఖ్య తగ్గించుకుంటున్నానని చెప్పడంతో పాటు వారిని వేరే ఆఫర్లు చూసుకోవాలని తేల్చేశాడట ఈ బడా నిర్మాత.
నిజానికి దిల్ రాజు ప్రొఫెషనల్ గానే వ్యవహరించే ప్రొడ్యూసరే అయినా.తనను నమ్ముకున్న వాళ్లకు మంచి చేయాలని భావించే మెంటాలిటీనే అంటారు ఇండస్ట్రీ జనాలు.అయితే గత కొంత కాలంగా ఈ నిర్మాతకు టైం అంతగా కలిసి రావడం లేదు.చేతిలో పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేవు.
అందుకే చిన్న – మీడియం హీరోలతో సినిమాలు తీస్తున్నాడీయన.దీంతోపాటు రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్టమి ఘోరంగా ఫెయిల్ అయింది.
ఇక డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు కూడా కొన్ని నిరుత్సాహపరిచాయి.







