దేశం లో మరే రాష్ట్రానికీ లేని ఖర్మ ఏపీ కే ఉంది అని ఇక్కడి ప్రజలు బాధ పడుతున్నారు.2004 లో కేంద్రం లో నే కాక యునైటెడ్ ఏపీ లో కూడా కాంగ్రెస్ సర్కారు కొల్వూ తీరగా అప్పుడు కేంద్రం మనవైపు సరిగ్గా చూడలేదు అని జనం బాధపడ్డారు.అసలు మన్మోహన్ సింగ్ పదేళ్ళ పాలన క్రమం లో ఏపీ కి ప్రత్యేకంగా ఒరగాబెట్టింది ఏమీ లేదు.ఏపీకి పెద్దపీట వేస్తూ.అటు వార్షిక బడ్జెట్ లో కానీ.ఇటు రైల్వే బడ్జెట్ లో కానీ ఆ పార్టీ ఏమైనా మేలు చేసిందా? అంటే లేదు.కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏపీ కారణమైనా.ఏపీ ప్రయోజనాల గురించి సీరియస్ గా పట్టించుకున్న పరిస్థితి కనిపించదు
వైఎస్ లాంటి ప్రజాకర్షక నేత ముఖ్యమంత్రిగా ఉన్నా.కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర అరచేతి మందాన పలుకుబడి ఉన్నప్పటికీ.అది ఏపీ ప్రయోజనాలకు ఉపయోగపడలేదు.
మన్మోహన్ అధికారంలో ఉన్న పదేళ్లు.అడక్కుండా ఇవ్వడం మాట అటుంచితే అడిగినా హ్యండిచ్చింది.
ఆంధ్రా జనాలకి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా తమకి తోచిన రీతి లో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ ని ముక్కలు ముక్కలు చేసింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగే పరిస్థితి రావడం చాలా దారుణం అని బాధ పడుతున్నారు జనాలు.







