చంద్రబాబు కొత్త పథకం షురూ .. సుపరో సూపర్

తెలంగాణా ప్రభుత్వం తో పోలిస్తే ఏపీ సర్కారు పథకాల విషయంలో చాలా నెమ్మదిగా ఉంది.అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలనీ పోల్చడం కూడా తప్పు కావచ్చు ఏమో పేరుకే రెండూ తెలుగు రాష్ట్రాలు కానీ ఇద్దరి దగ్గరా పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది.

 Cm Chandrababu To Launch Fibre Grid-TeluguStop.com

వీరి దగ్గర లోటు బడ్జెట్ ఉండగా తెలంగాణా ది సర్ప్లస్ బడ్జెట్.అయితే ఇప్పుడు పథకాల విషయం లో ఒద్దన్నా పోటీ ఒస్తూనే ఉంది.

కెసిఆర్ పథకాల విషయం లో చెలరేగిపోతున్నారు అనుకున్న వేల చంద్రబాబు సర్కారు ఒక కొత్త పథకం తెరమీదకి తీసుకుని ఒచ్చింది.ఈ పథకం గత కొంత కాలంగా అమల్లోకి ఒచ్చినా ఇవాళ నుంచే ప్రారంభం కాబోతోంది.
సాంకేతిక విప్లవం ద్వారా సాధించిన ఫలాన్ని సామాన్యులకి ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు మొదలు పెట్టిన ఈ కీలక పథకం 150 క్కి ఇంటర్నెట్ , ఫోన్ ,టీవీ సౌకర్యం.ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా.

కారు చౌకకే ఇంటర్నెట్ సేవల్ని అందించటమే లక్ష్యంగా బాబు పెట్టుకున్నారు.ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 22500కిలోమీటర్లు అఫ్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలని నిర్ణయించింది.

ఇప్పటివరకూ 9వేల కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ వేసిన సర్కారు.మిగిలిన లక్ష్యాల్ని త్వరలో పూర్తి చేయనుంది.

ఈ రోజు షురూ చేసే పథకాన్ని ఏప్రిల్ నుంచి విశాఖలో అందించనున్నారు.దశల వారీగా రాష్ట్రం మొత్తం ఈ పథకం అమలు కానుంది.ఏపీలోని 1.3 కోట్ల గృహాలు.వ్యాపారసంస్థలకు దీని ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తారు.నెలకు కేవలం రూ.150 చెల్లిస్తే.ప్రతి ఇంటికి 10 – 15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్.

ఫోన్.టీవీ సౌకర్యాలు కల్పించనున్నారు.

ఈ పథకానికి నాంది అయిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం విశాఖలో షురూ చేయనున్నారు.ప్రభుత్వం మాటల్లో చెప్పినట్లే చేతల్లో చూపించగలిగితే.

సరికొత్త సాంకేతిక పథకాన్ని అతి తక్కువ ధరకు అందజేసిన ఘనత చంద్రబాబుకు దక్కటం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube