నాగార్జున, కార్తీలు హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన చిత్రం ‘ఊపిరి’.ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం ‘టచబుల్’కు కాపీ అనే విషయం తెల్సిందే.
మొదట కాపీ అని ప్రకటించకుండా షూటింగ్‌ను షురూ చేశారు.అయితే షూటింగ్ మధ్యలోనే ఇది ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని తేలడంతో చేసేది లేక స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులే ఇది ఫ్రెంచ్ చిత్రానికి రీమేక్ అంటూ ప్రకటించారు.
అయితే కథలో చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా వారు చెప్పారు.కాని చూడబోతుంటే ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించినట్లుగా అనిపిస్తోంది.
సినిమాలోని దాదాపు 90 శాతం సీన్స్‌ను ఆ సినిమా నుండే తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ట్రైలర్‌ను అయినా కొత్తగా చూపించారా అంటే అదీ లేదు.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఆకట్టుకునే విధంగా ‘ఊపిరి’ ట్రైలర్ ఉంది.
కాని ఇది అచ్చు గుద్దినట్లుగా ఫ్రెంచ్ చిత్రం టచబుల్ ట్రైలర్ ఉన్నట్లుగా ఉంది.ఆ ట్రైలర్ చూస్తే ‘ఊపిరి’ సినిమాను మొత్తం కాపీ చేశారు అనేది తెలిసి పోతుంది.
పాత్రలు, సన్నివేశాలతో పాటు అన్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా దించేశారు.కథ కాపీ చేస్తే పర్వాలేదు కాని, ఏకంగా ట్రైలర్‌కు కూడా సొంత క్రియేటివిటీని ఉపయోగించకుండా ఇలా చేయడం ఏంటని కొందరు చెవులు కొరుకుంటున్నారు.







