ప్రజాసేవ చేసేందుకు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయం లెక్కలు చూస్తే కళ్లు తిరగక మానవు.ఇక.
అధికారంలో ఉంటే వాటి ఆదాయం అదిరిపోవాల్సిందే.అధికారికంగా చూపించే ఆదాయం ఆ రేంజ్ లో ఉంటే.
అనధికారంగా వచ్చేది మరెంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదేమో.తాజాగా 2010 నుంచి 2014 మధ్య వివిధ రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయానికి సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ వివరాల్ని వెల్లడించింది.దీని ప్రకారం 2010 నుంచి 2014 సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.1687.12 కోట్లు.అదే సమయంలో బీజేపీకి వచ్చిన ఆదాయం 1475.44 కోట్లు.ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం గమనార్హం.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.అధికారిక లెక్కలు చూపించిన దాని ప్రకారం.కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ భారీ ఆదాయంలో సింహభాగం (77.7శాతం) పార్టీ సభ్యత్వ కూపన్లు.పార్టీ ప్రచురణల ద్వారా వస్తే.బీజపీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 87.9 శాతం స్వచ్ఛంద విరాళాల రూపంలో అందటం విశేషం.
ఇదే కాలంలో సీపీఎం రూ.552.3 కోట్ల ఆదాయం రాగా.బీఎస్పీకి రూ.391.2 కోట్లు.సీపీఐ రూ.9.02కోట్లు సేకరించింది.ప్రజాసేవ చేసే రాజకీయ పార్టీల అధికారిక ఆదాయం అదిరిపోయేలా ఉన్నాయే.







