గ్రేటర్ అధికార పీఠం మీద కూర్చునే గులాబీ కండువా వ్యక్తి ఎవరు అనేది తెలిసిపోయింది.పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడిన కీలక నేతగా పేరున్న బొంతు రామ్మోహన్ ని మేయర్ గా ఎంపిక చేసారు కెసిఆర్ .
తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు.ఆయనకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
బొంతు మీద తెలంగాణా ఉద్యమ సమయంలో దాదాపు నూట నలభై రెండు కేసులు ఉన్నాయి.నాలుగైదు నెలల పాటు చర్లపల్లి జైల్లోనే గడిపారు బొంతు.
ఆయన ఏ జైల్లో ఖైదీగా ఉన్నారు ఇప్పుడు అదే జైలు ఉన్న చర్లపల్లి నుంచి కార్పొరేటర్ గా ఎన్నిక అయ్యారు .ముఖ్యమంత్రి కి అత్యంత అన్నిహితుడు అయిన ఆయన గ్రేటర్ బరిలో కూడా దిగాలి అనుకోనేలేదు.చివరి నిమిషంలో పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్ బరిలోకి దిగిన ఆయన కార్పొరేటర్ గా విజయం సాధించటమే కాదు.ఇప్పుడు ఏకంగా మహానగర ప్రధమ పౌరుడిగా అవతరించనున్నారు.
ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన బొంతు.ఇప్పుడు అదే వర్సటీలో తన పీహెచ్ డీని సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో మేయర్ గా పదవిని చేపట్టనున్న నేత.ఉన్నత విద్యను అభ్యసించి ఉండటమే కాదు.యువకుడై ఉండటం గమనార్హం.







