9 కోట్లు ఇస్తేనే వస్తా అంటున్న రవితేజ

ఆ మధ్యన కాస్త బేలగా కనపడినా హీరో రవితేజ ప్రస్తుతం మంచి ఫార్మ్ లోకి ఒచ్చినట్టు కనిపిస్తున్నాడు.కిక్ 2 పక్కకి పెడితే బలుపు, పవర్ , బెంగాల్ టైగర్ సినిమాలు హిట్ లు కొట్టి తాను ఇంకా పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ లోనే చెప్పకనే చెప్పాడు రవి.

ప్రస్తుతం వేణు శ్రీరాం సినిమా క్యాన్సిల్ చేసుకుని చక్రీ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా మొదలు పెట్టిన రవి , దిల్ రాజు తో పారితోషికం దగ్గర విభేదాల కారణంగానే బయటకి వచ్చినట్టు చెబుతున్నారు.

చక్రీ సినిమా కంటే ముందు ఓహ్ మై ఫ్రెండ్ ఫ్రేం డైరెక్టర్ వేణూ తో రవి ఒక సినిమా సంతకం పెట్టాడు.ఏదైనా పెర్ఫెక్ట్ గా సెట్ చేసుకునే దిల్ రాజు – రవితేజ ల మధ్యన కేవలం డబ్బుల విషయం లో క్లాస్ వచ్చిందట.9 కోట్లు అడిగిన రవితేజ కి అంత ఇచ్చుకోలేని అని దిల్ రాజు తెగేసి చెప్పడం తో బయటకి వచ్చేసాడట రవి.

ఇప్పుడు కొత్త ప్రాజక్ట్ గురించి ఇప్పుడు మరొక టాక్ వినిపిస్తోంది.కనీసం 9 కోట్లు ఇవ్వందే సినిమా ను మరో 10 రోజుల్లో సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రసక్తే లేదంటున్నాడట మాస్ రాజా.

ఇప్పుడు రవితేజ ఇంతగా డబ్బు విషయంలో పట్టు పట్టడానికి కారణాలు ఏంటా అనుకుంటున్నారు చాలామంది.అలాగే రెమ్యూనరేషన్ దగ్గర గట్టిగా ఉండకుండా.అదేదో సినిమాలో వాటా తీసుకుంటే.అటు ప్రొడ్యూసర్ కి కూడా ఊరట ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube