అందరి ముందరా ఏడ్చేసిన లేడీ డైరెక్టర్

కెరీర్ లో అతిపెద్ద హిట్ అందుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని మన నోటితో చెప్పలేం.ఫేయిల్యూర్ ల తరవాత వచ్చే సక్సెస్ అయితే మనల్ని వేలెత్తి చూపించిన వారు అందరికీ సమాధానం లాగా భలే పనిచేస్తుంది.

 Saala Khadoos Director Sudha Cries Before Media-TeluguStop.com

ఇప్పుడు మన తెలుగు అమ్మాయి సుధా కొంగర అదే ఆనందం లో ఉంది.

తమిళం లో ఇరుండ్రు సుత్రు పేరుతో విడుదల అయిన మాధవన్ సినిమా హిందీ లో సాలా ఖదూస్ గా విడుదల అయ్యింది రెండు చోట్లా ఈ సినిమా ఘన విజయం సాధించి, బాక్స్ ఆఫీస్ వసూళ్లు మాత్రమే కాకుండా విమర్శకుల దగ్గర నుంచి ప్రసంసలు కూడా అందుకుంది.

‘‘ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.ముందు సినిమా తొలి కాపీ రెడీ అయ్యాక ఓ పది పదిహేను మందికి సినిమా చూపించాను.

వాళ్లందరూ ఏడ్చారు.అలా ఒక్కొక్కరికి షో చూపించినపుడల్లా రాజ్ కుమార్ హిరాని గారికి ఫోన్ చేసి మన సినిమా చూసి ఏడ్చారంటూ శాడిస్టులాగా నవ్వుతూ చెప్పేదాన్ని.

ఐతే సినిమా విడుదలకు ముందు జనాలు రకరకాలుగా మాట్లాడారు.ఇది బాలీవుడ్లో మాత్రమే ఆడుతుందని.

అది కూడా మల్టీప్లెక్సులకే పరిమితమైన సినిమా అని.నెగెటివ్ కామెంట్లు చేశారు.కానీ బాలీవుడ్లో కంటే కూడా తమిళనాట ఈ సినిమా గొప్పగా ఆడుతోంది.విడుదలకు ముందు రోజు ప్రెస్ షో దగ్గర్నుంచే నా సినిమా సక్సెస్ మొదలైంది.చాలామంది మీడియా ప్రతినిధులు ఏడుస్తూ ఫోన్ చేశారు.నాకు కూడా ఏడుపొచ్చింది.

మీడియా వాళ్లు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు.మంచి రేటింగులతో సినిమాకు గొప్ప విజయాన్నందించారు.

మా విజయాన్ని వాళ్లే సెలబ్రేట్ చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతమైంది సుధ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube