సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న మహేష్‌బాబు వచ్చే ఏప్రిల్ నుండి మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.
ప్రస్తుతం మురుగదాస్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రం గురించిన మరో ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనయుడు అఖీర కనిపించనున్నాడు అనేది వార్త సారాంశం.
మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
మెగా ఫ్యామిలీకి ఠాగూర్ మదు సన్నిహితుడు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఠాగూర్ మధుకు సన్నిహిత్యం చాలా ఉంది.
ఆ సన్నిహిత్యంతో తాను మహేష్‌బాబుతో నిర్మిస్తున్న సినిమాలో అఖీర బాబును నటింపజేయాల్సిందిగా ఠాగూర్ మధు పవర్ స్టార్‌ను కోరినట్లుగా సమాచారం ఉంది.అందుకు అఖీరకు ఇష్టం అయితే తనకు సమస్య లేదు అని అన్నాడట.
దాంతో వెంటనే రేణుదేశాయ్ మరియు అఖీరాలతో మధు చర్చలు జరిపాడని వారు కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.మహేష్‌బాబు అంటే అఖీరకు అభిమానం.
ఆ అభిమానంతో వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు.అఖీర ఎంట్రీతో ఆ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.







