ప్రేమలో అందాల రాక్షసి?

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో మునిగి తేలుతుందంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.ఈమె తన సహ నటుడు నవీన్‌ చంద్రతో పీకల్లోతు ప్రేమలో ఉందట.

 Lavanya Tripathi In Love With Hero Naveen Chandra?-TeluguStop.com

వీరిద్దరు కలిసి ‘అందాల రాక్షసి’ మరియు ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.మొదటి సినిమా నుండే వీరిద్దరి మధ్య సన్నిహిత్యం ఉంది.

ఆ సన్నిహిత్యం మరియు పరిచయం రెండవ సినిమా సమయంలో ప్రేమకు దారి తీసిందని, ప్రస్తుతం వీరిద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి జంటగా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.

ఆ సమయంలో వీరిద్దరి అన్యోన్యం మీడియా కంట పడటం జరిగింది.దాంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది.

‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది.ఈ సమయంలో ప్రేమ దోమ, డేటింగ్‌, గీటింగ్‌ అంటూ తిరిగితే కెరీర్‌కు కష్టం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరి వారి సలహాలు సూచనలు తీసుకుని ప్రస్తుతానికి ప్రేమను పక్కన పెడుతుందా లేక అతడితో చెట్టా పట్టాలేసుకుని తిరిగి మొదటికే మోసం తెచ్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube