టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది.అయినా ఇప్పటి వరకు తన తర్వాత సినిమాను ఈయన మొదలు పెట్టింది లేదు.
గోవిందుడు వచ్చిన వెంటనే ఈయన ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఆ సినిమాను ప్రకాష్ రాజ్ మరియు దిల్‌రాజులు కలిసి నిర్మించబోతున్నారని, ఆ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించనుందని, ఆ చిత్రానికి ‘రుద్రక్ష’ అనే టైటిల్‌ను సైతం ఫిక్స్ చేసినట్లుగా కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పటి వరకు కూడా కృష్ణవంశీ సినిమాపై క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం కృష్ణవంశీ ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరో వైపు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ సమంత నటించబోతుందని, అనుష్క బిజీ షెడ్యూల్ కారణంగా సమంతను కృష్ణవంశీ బుక్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.తెలుగుతో పాటు ఒకే సమయంలో తమిళంలో కూడా చిత్రీకరించాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇదే సంవత్సరం వేసవిలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరియు సమంతల కాంబోలో మూవీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
టైటిల్‌పై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.హీరోయిన్‌గా స్టార్ రేంజ్‌లో ఉన్న సమంత ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మంచి పరిణామం కాదు అని ఆమె సన్నిహితులు మరియు అభిమానులు అంటున్నారు.







