ఇదిగో మొదలు, అదిగో మొదలు అని ఏడాదిగా ఊరిస్తున్నారు.ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం కుదిరింది.
అది కూడా అలాంటి ఇలాంటి ముహూర్తం కాదు.బ్లాక్బస్టర్ ముహూర్తం.
ఫిలింనగర్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మార్చి 28న ఈ చిత్రాన్ని వైభవంగా మొదలుపెట్టనున్నారు.ఇక దీన్ని బ్లాక్బస్టర్ ముహూర్తం ఎందుకు అన్నారు అనే కదా మీ అనుమానం.
ఈ దర్శకుడు ఎవరు ? వివి వినాయక్.ఆయన మొదటి చిత్రం ఏంటి ? ఆది.అది ఎప్పుడు విడుదలైందో గుర్తుందా ? 2002లో మర్చి 28న విడుదలైంది.ఆ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూనే అదే రోజు కత్తి రిమేక్ ని మొదలుపెట్టాలి అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాలేదు.
రామ్ చరణ్ తో పాటు లికా ప్రోడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తారు.







