3వ వారంలో సరికొత్తగా ‘నాన్నకు ప్రేమతో’

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

మొదటి వారంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

రెండవ వారంలో కూడా ఈ సినిమాకు పోటీ లేక పోవడంతో అదే స్థాయి కలెక్షన్స్‌ను రాబడుతోంది.ఇక మూడవ వారంలో స్టడీ కలెక్షన్స్‌ను రాబట్టేందుకు కొన్ని సీన్స్‌ను యాడ్‌ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్య సీన్స్‌ను లెంగ్త్‌ ఎక్కువయ్యింది అనే కారణంతో తొలగించడం జరిగింది.ఆ సీన్స్‌ను జత చేసే అవకాశాలున్నాయి.

వెన్నెల కిషోర్‌ కామెడీ సీన్స్‌తో పాటు, రాజేంద్ర ప్రసాద్‌ మరియు ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఒక సెంటిమెంట్‌ సీన్‌ను సైతం మూడవ వారం నుండి యాడ్‌ చేయనున్నారు.మొత్తంగా నాలుగు నుండి అయిదు నిమిషాల నిడివితో సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారు.

Advertisement

ప్రస్తుతం ఉన్న సీన్స్‌ నుండి రెండు నిమిషాల సీన్‌ను తొలగించనున్నారు.కలెక్షన్స్‌ను రాబట్టుకోవడానికి గతంలో పలు సినిమాలకు ఇలా కొన్ని సీన్స్‌ను యాడ్‌ చేయడం జరిగింది.

వాటిలో కొన్ని సక్సెస్‌ అవ్వగా మరి కొన్ని పెద్దగా మెప్పించలేక, కలెక్షన్స్‌ను తెచ్చుకోవడంలో విఫలం అయ్యాయి.మరి ఈ ‘నాన్నకు ప్రేమతో’ కొత్త సీన్స్‌ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు