1-నేనొక్కడినే లాంటి భారి డిజాస్టర్ ఇచ్చి మహేష్ కెరీర్ లో ఉన్న ఊపుని తగ్గించానని ఫీల్ అయ్యాడో, ఆ సినిమా వల్ల పంపిణిదారులు,నిర్మాతలు ఆస్తులు అమ్మేసుకోవాల్సి వచ్చిందని బాధపడ్డాడో, ఎన్టీఆర్ కి తన కెరీర్ లో అత్యధిక కలెక్షన్ల సినిమా ఇచ్చినందుకు సంతృప్తి చెందాడో తెలియదు కాని , ఇక సినిమాలు డైరెక్ట్ చేయడం మానేస్తాడంటా సుకుమార్.మీరు విన్నది నిజమే.
నిజంగానే సినిమాలు డైరెక్ట్ చేయడం మానేస్తానని ప్రకటించాడు మన టాలివుడ్ నోలాన్.కాని ఇపుడప్పుడే కాదు.
మరో రెండు సినిమాలు తీసిన తరువాత.
ఈ విషయాన్ని సుకుమార్ ఒక ప్రముఖ తెలుగు వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో చెప్పాడు.
అసలు సుకుమార్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది.నిజంగానే మానేస్తాడా లేకా ఎదో సరదాగా అన్నాడా.
మ్యాటర్లో ఎంతవరకు నిజాయితీ దాగుంది, అసలు సుకుమార్ నిజంగానే సినిమాలు మానెయ్యాలి అనుకుంటే దానికి కారణం ఎవరు ? ఇవన్ని తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.ఎందుకంటే ఆ ఇంటర్వ్యు ఇంకా పూర్తిగా బయటకి రాలేదు.
ఈ విషయాన్ని పక్కన పెడితే, నాన్నకు ప్రేమతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపిస్తోంది.అన్ని చోట్లా లాభాలు వస్తాయో లేదో తెలియదు కాని, ఎన్టీఆర్ కి తోలి 50 కోట్ల సినిమా, ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళ సినిమా అయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.







